కృష్ణతో మధు చెప్పిన ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
on Sep 30, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -275 లో.. కృష్ణ తలని మురారి తూడుస్తూ ఉంటాడు. కాసేపటికి మీరు ఎవరినైనా ప్రేమించారా అని మురారిని కృష్ణ అడుగుతుంది. మురారి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిన కాసేపటికి ప్రేమించాను ప్రేమిస్తానంటూ గొప్పగా చెప్తాడు. మురారి చెప్పేది కృష్ణ గురించి అని కృష్ణకి తెలిసి కూడా కావాలనే మురారితో చెప్పించాలని అనుకుంటుంది. కానీ మురారి మాత్రం కృష్ణకి నా ప్రేమ ఇంకా అర్థం కావడం లేదా అని అనుకుంటాడు.
మరొక వైపు ముకుంద సెల్ఫీ లు దిగుతూ చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడే అలేఖ్య వస్తుంది. ఏంటి ముకుంద మంచి హైప్ మీద ఉన్నావని అడుగుతుంది. ఇక ముకుంద అలేఖ్యతో.. కృష్ణకి నిజం తెలిసిపోయిందనే విషయం చెప్తుంది. కృష్ణ, ముకుంద మధ్య ఛాలెంజ్ గురించి కూడా చెప్పి, ఎలాగైనా సరే నా మురారి ప్రేమని దక్కించుకుంటానని అలేఖ్యకి ముకుంద చెప్తుంది. మరొక వైపు నేను ప్రేమిస్తున్న విషయం కృష్ణకి మమ్మీ చెప్పింది కదా అయిన ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందని మురారి అనుకుంటాడు. కాసేపటికి మురారి దగ్గరికి రేవతి వస్తుంది. నేను ప్రేమిస్తున్న విషయం కృష్ణకి చెప్పవా అని మురారి అడుగుతాడు. చెప్పానని రేవతి అనగానే.. మరి కృష్ణ ఎందుకు ఏం తెలియనట్టు ప్రవర్తిస్తుందని మురారి అనగానే.. ఆడపిల్ల ఆ మాత్రం సిగ్గు ఉండదా? నువ్వే నీ ప్రేమ విషయం చెప్పమని మురారితో రేవతి చెప్తుంది.
మరొక వైపు కృష్ణ గురించి మురారి ఆలోచిస్తుంటాడు. అప్పుడే కృష్ణకి ఫోన్ వస్తుంది. కృష్ణ బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేసి.. చెవి దగ్గర పెట్టమని చెప్తుంది. కృష్ణకి ఫోన్ చేసింది కృష్ణ ఫ్రెండ్. ఆ తర్వాత కృష్ణ తన ఫ్రెండ్ స్టోరీ చెప్పి కాసేపు మురారిని ఆటపట్టిస్తుంది కృష్ణ. కాసేపటికి మధుతో కృష్ణ మాట్లాడుతుంది. ముకుందతో చేసిన ఛాలెంజ్ గురించి మధుకి కృష్ణ చెప్పగా.. ఇంకేంటి రెచ్చిపో అని మధు అంటాడు. ఇంట్లో గొడవ అయిపోద్ది. పెద్ద అత్తయ్యకి తెలుస్తుందని కృష్ణ చెప్తుంది. అయితే ఒక ప్లాన్.. నువ్వు మురారి ఎప్పుడు కలిసి మెలిసి ఉంటారు కదా, ఇక అలా ఉండకండి అని అనగానే కృష్ణ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
